భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఓ అమ్మాయి బహుమతి అందించింది. స్వయంగా గీసిన కోహ్లీ చిత్రాన్ని అతడికి ఇచ్చింది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు మైదానంలోకి వెళ్తున్న సమయంలో విరాట్ కోహ్లీ వద్దకు ఓ అమ్మాయి వచ్చింది. స్వయంగా గీసిన పెయింటింగ్ ను కోహ్లీకి ఇచ్చి ఫొటో దిగింది.