రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతోపాటు పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ టోర్నీకి ముందు ‘దిగ్గజ త్రయం’ నాదల్, ఫెడరర్, జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో ఫెడరర్, జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి 35 ఏళ్ల నాదల్ ముందుకొచ్చాడు. సమీప భవిష్యత్‌లో నాదల్‌ను అధిగమించే అవకాశం కేవలం 34 ఏళ్ల జొకోవిచ్‌కు మాత్రమే ఉంది. గాయాలతో సతమతమవుతున్న 40 ఏళ్ల ఫెడరర్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది.