యూట్యూబూర్ 7ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బోల్డ్‌నెస్‌తో నెట్టింట రచ్చ చేసే సరయు బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర విజువల్స్ ఉన్నాయంటూ సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.