- ఆకుపచ్చగా ఉంటే… దాన్ని సూడోమోనాడ్ అనే కుటుంబానికి చెందిన సూడోమొనాస్ అనే ఒక రకం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుండవచ్చు.
- పసుపుపచ్చగా ఉంటే… క్లెబ్‌సిల్లా నిమోనియా తరహా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పడు వచ్చే దగ్గుతో పాటు ఈ రంగులో తెమడ (కళ్లె) పడవచ్చు.
- ఎర్రగా ఉంటే… సూడోమొనాలీ, నీమోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఎర్రరంగులో కళ్లెపడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఎర్రరంగు కళ్లె పడవచ్చు. అయితే ఇలా ఎర్రరంగు పడ్డప్పుడల్లా అది క్యాన్సర్‌కు సూచన అని అందోళన పడాల్సిన అవసరం లేదు. ఇలా కనిపించేవాళ్లలోనూ క్యాన్సర్ ఉండేవారి శాతం చాలా తక్కువ.
- నల్లగా ఉంటే… కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు.