తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు అడ్డుచెప్పాడనే ఆక్రోశంతో యువతి చిన్నాన్నను ఓ యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన చిత్రదుర్గం జిల్లా హోలాల్కెర తాలూకా చిత్రహళ్లి గొల్లరహట్టిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన ఈశ్వరప్ప(65) అన్న కుమారుడు చిత్రలింగ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కొద్ది రోజుల క్రితం తన చినాన్న ఈశ్వరప్పకు తెలిపాడు. అయితే ఆ యువతి ఈశ్వరప్పకు మనువరాలు అవుతుంది.