ఒక ప్రేమజంట ఈ నెల 27న తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోవడంతో గండేపల్లి మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత నెలకొంది. అబ్బాయి తండ్రిపై అమ్మాయి కుటుంబ సభ్యులు ఆదివారం దాడి చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట సీఐ సూరి అప్పారావు అందించిన వివరాలు ఇలా వున్నాయి. ఉప్పలపాడుకు చెందిన పిల్లి కృష్ణకుమార్ సీతానగరం మండలం ఇనుగంటివారి పేటకు చెందిన అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి అమ్మమ్మగారి గ్రామమైన ఉప్పలపాడు వచ్చి వెళుతున్న నేపథ్యంలో కృష్ణకుమార్‌కు ఆమెకు పరిచయం ఏర్పడిగా ప్రేమగా మారింది.