సఖ్యతకు అడ్డొస్తున్నాడని ఓ మహిళ ఘాతుకానికి తెగబడింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీ పరిధి పానగల్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానగల్‌కు చెందిన ఇరగదిండ్ల వెంకన్న (40) బోరు బావుల తవ్వకం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి భార్య సుజాత పత్తి కూలి మేస్త్రీగా పనిచేస్తోంది. వీరికి కూతురు, కుమారుడు సంతానం. సుజాత పత్తి కూలీలను తీసుకుపోయే క్రమంలో చెర్వుగట్టుకు చెందిన లింగస్వామితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో సుమారు మూడు మాసాల క్రితం ఇద్దరూ ఇళ్లనుంచి పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇద్దరిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి సుజాతను భర్త వెంకన్న వద్దకు పంపించారు. తమ సఖ్యతకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని అప్పటినుంచే ఇందిర నిర్ణయించుకుంది.