ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్ సెక్టార్‌లో ప్రముఖ కంపెనీగా వెలుగొందుతున్న డ్రిల్‌మెక్‌స్పా సంస్థ తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు సై అంది. ఈ మేరకు తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేందుకు డ్రిల్‌మెక్ స్పా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇటలీకి చెందిన డ్రిల్‌మెక్ స్పా ఆయిల్ డ్రిలింగ్, రిగ్గింగ్ సెక్టార్ ఎక్విప్‌మెంట్ తయారీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది.
డ్రిల్‌మెక్ స్పా సుమారు రూ 1500 కోట్లు (200 మిలియన్ డాలర్ల) వ్యయంతో తెలంగాణ ఆయిల్ రిగ్ మెషినరీ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 2500ల మంది ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయిల్, నేచురల్ గ్యాస్ వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో డ్రిలింగ్ స్పా కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉంది.