సంక్రాంతి పండుగకు పట్నం జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులతోపాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల వాసులు స్వస్థలాలకు వెళ్తున్నారు. శనివారం నుంచే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అదనంగా టోల్ వేలను తెరిచారు. 16 టోల్ వేలు ఉండగా, విజయవాడ వైపు 10, హైదరాబాద్ వైపు 6 మార్గాలను కేటాయించారు.