గతంలో భర్త, కుమార్తెను వదిలి ప్రియుడే కావాలని రచ్చకెక్కిన ఓ మహిళ తాజాగా తాను ఆది పరాశక్తి అవతారం అని చెప్పుకుంటూ.. తెర మీదకు రావడం స్థానికులను విస్మయంలో పడేసింది. పైగా అన్నపూర్ణి అరసు మాతాజీగా భక్తులకు కొత్త సంవత్సరం వేళ ఉపదేశం ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. దీంతో ఈ మాతాజీ కోసం పోలీసులు వేట మొదలెట్టారు.